31-01-2026 03:22:09 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ మండలంలోని కట్టకొమ్ము తండాలో యంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులు 10. 00 లక్షల రూపాయల వ్యయంతో నూతన నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళల సాధికారతకు, వారి స్వయం ఉపాధి, సమూహ బలోపేతానికి ఈ భవనం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఇందిరమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మరింత బలాన్నిచ్చేలా ఇలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తోంది. అన్నారు,గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా ఇది ఒక కీలక అడుగు. అని పేర్కొన్నారు క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల లీజులు, పెట్రోల్ బంకుల యాజమాన్యం మహిళా సంఘాలకే అప్పగించాం తెలిపారు. ఇందిరా మహిళా డెయిరీలో మహిళలే వాటాదారులు పాలు నుంచి అనుబంధ ఉత్పత్తుల వరకు అన్ని కార్యకలాపాలు మహిళల చేతులలోనే ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు లోకాసాని శ్రీధర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, సర్పంచుల సంఘం ఫోరం మండల అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, సర్పంచ్ నేనావత్ జ్యోతి పాండు నాయక్,నేనావత్ కవిత లచ్చిరామ్ నాయక్, లక్ష్మి గోవింద్, రవీందర్ నాయక్,నాయకులు శివయ్య, పిఆర్ ఈఈ రఘుపతి, ఎఈ శంకర్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ హుస్సేన్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఏపిఓ విజయ లక్ష్మి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.