calender_icon.png 10 November, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: నలుగురు ఏపీ వాసులు మృతి

18-04-2025 12:46:41 PM

రాయచూర్: కర్నాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం(Karnataka Road Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్(Hindupuram) మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులు హిందూపురం నుంచి కర్నాటక యాద్గిర్ జిల్లా(Yadgir District)లోని షాహర్ పూర్ వైపు గొర్రెలు కొనడానికి బొలెరో పికప్ వాహనంలో వెళుతుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి అమరాపుర క్రాస్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టాడు. మృతులను నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళిగా గుర్తించారు. ఈ సంఘటనలో డ్రైవర్ ఆనంద్ గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న గబ్బూర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.