calender_icon.png 10 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ డిస్ట్రిబ్యూషన్!

10-11-2025 01:02:11 AM

ప్రచారానికి తెర.. పంపకాలు మొదలు?

  1. ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
  2. ఖర్చు దాదాపు రూ. 300 కోట్లు!

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : గత నెలరోజులుగా రాష్ట్ర రాజకీయమంతా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టే తిరుగుతున్నది. అన్ని ప్రధాన పార్టీల నాయకులం తా ఇక్కడే మకాం వేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులు మొదలుకుని ద్వితీయ శ్రేణి నాయకుల వరకు, బీఆర్‌ఎస్ తరఫున అగ్ర నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ పాల్గొని తమ అభ్యర్థి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారంచేశారు.

ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ప్రచారంతో హోరెత్తిన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నిశ్శబ్దం ఆవరించింది. ఇప్పుడే అస లు కథ మొదలైంది. ఇప్పటివరకు పగటిపూట ప్రచారాలపై ఎక్కువగా దృష్టి సారించిన పార్టీలు, ఇకపై రాత్రిపూట పంపకాలపై ఫోకస్ చేస్తున్నాయి. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పదిరోజులుగా నోటితో ఓటర్లను ఆకట్టుకున్న పార్టీ లు, నాయకులు..

ఇప్పుడు నోటు తో ఆకట్టుకోనున్నారని  స్థానిక పరిశీలకులు చెబుతున్నారు. రాజధాని నగరంలోని కీలకమైన, సంపన్న నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా మరింత ఆసక్తిని పెంచుతున్నది. అయితే ప్రపంచ సాంకేతిక కేంద్రంగా పేరుపొందిన హైదరాబాద్ నగరం.. ప్రస్తుతం జూబ్లీహి ల్స్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపి ణీ చేయడంలో సాంకేతికతను ఉపయోగించుకోనున్నది. ఎన్నికల పం పకాల్లో అప్‌డేట్ అయింది. నిఘా కన్నుగప్పి, గుట్టురట్టు కాకుండా డిజిటల్ మార్గంలో ఓటర్లకు పేమెం ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

ప్రచారమైనా, పంపకాలైనా తగ్గేదేలే..

సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుకు, ఉప ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులో భారీగా వ్యత్యా సం ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికలను ఆయా పార్టీలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా యి. ఉప ఎన్నికలు వస్తున్న కొద్దీ ఖర్చు అంచనాలను మించిపోతున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉప ఎన్నికల ఖర్చు పెరగే సంప్రదా యం రెట్టింపు అయింది. ఈ క్రమం లో ఇప్పటికే అనేక ఉప ఎన్నికలు తెలంగాణలో జరిగాయి.

అయితే వాటిలో ప్రధానంగా హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలను ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో అక్కడ డబ్బు ప్రవాహం జరిగింది. ఓటర్లే రోడ్లపైకి వచ్చి మరీ డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. అయితే ఆ ఉప ఎన్నికలకు మించి జూబ్లీహిల్స్‌లో ధన ప్రవాహంతో ఓటర్లను ప్రలోభానికి గురిచేసే పరిస్థితి ఉండబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఎంతో ప్రతిష్టాత్మకం కావడమే.  

ఓటుకు రూ. 6 వేల అంటగా...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో ఓటు రూ. 6 వేలు పంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీలు కూ డా భారీగా పంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయని తెలుస్తోంది.

అయితే హుజురా బాద్, మునుగోడు ఉప ఎన్నికలను తలదన్నేలా జూబ్లీహిల్స్‌లో దాదాపు రూ. 300 కోట్ల వరకు ఎన్నికల ఖర్చు అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రచారం ముగియడంతో నియోజకవర్గంలో సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా గుట్టుగా పంపకాలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో పోలింగ్ ముగిసేవరకు వీలైనన్ని మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. 

నిఘా నీడలో నియోజకవర్గం..

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే నగదు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీని అరికట్టేందుకు ఎన్నికల సంఘం కట్టుది ట్టమైన చర్యలు చేపట్టింది. ఫ్లయింగ్ స్క్వా డ్‌లు, స్టాటిక్ సర్వులైన్స్ బృందాలు నియోజకవర్గంలోని ప్రతి గల్లీ, ప్రతి బస్తీపై డేగ కన్నుతో నిఘా ఉంచాయి. అనుమానిత వా హనాలను తనిఖీ చేయడంతో పాటు, పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ లావాదేవీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

బ్యాంకులతో సమన్వయం చేసుకుని, అనుమానిత ఖాతాలపై నిఘా పెట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ధారించేది పోలింగ్ రోజు అయితే, ఆ పోలింగ్ సరళిని ప్రభావితం చేసేది ఈ 48 గంటల ‘సైలెంట్ పీరి యడ్’ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రెండు రోజుల్లో ఏ పార్టీ ఓటర్లను ఎంత మేర కు ప్రలోభపెట్టగలుగుతుందనే దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటా యని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా, వాటిని అధిగమించి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పార్టీలు చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో, ఓటరు ప్రలోభాలకు లొంగకుండా తన విచక్షణతో ఓటు వేస్తాడో లేదో తేలాలంటే నవం బర్ 14న జరిగే ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే.

ఓటుకు డిజిటల్ నోటు..

ఎన్నికల చివరి క్షణాల్లో ఇంటింటికీ నగదు పంచి ఓటర్లను ప్రలోభపెట్టడం ఇప్పటి ఉన్న ట్రెండ్. అయితే, ఈసారి ఎన్నికల సంఘం డేగ కన్ను నుంచి తప్పించుకోవడానికి, టెక్నాలజీని వాడుకుంటూ కొత్త పంథాలో డబ్బు పంపిణీకి కొన్ని పార్టీలు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. నగదుతో పాటు, యూపీఐ లావాదేవీల ద్వారా డిజిటల్ కరెన్సీని నేరుగా ఓటర్ల ఖాతాల్లోకి జమచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా ఓటుకు ఇంత అని.. డబ్బును బదిలీ చేయడానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇది ఎన్నికల సంఘానికి, పోలీసులకు కొత్త సవాలుగా మారింది. నగదు లావాదేవీలను పట్టుకోవడం సులభమే అయినా, యూపీఐ ద్వారా చిన్న చిన్న మొత్తాల్లో జరిగే లక్షలాది లావాదేవీలను పట్టుకోవడం కష్టసాధ్యం. శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు అన్న చందాన ఆయా పార్టీలు ఎన్నికల్లో ప్రలోభ మార్గాలను ఎంచు కుంటున్నాయి. అయితే ఈ పరిణామంతో ఆ పార్టీలకు జూబ్లీహిల్స్‌లో గెలువడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. 

కేంద్ర మంత్రి సంజయ్‌పై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు 

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా  హిందూ, ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఆదివారం  ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌లో 80శాతం మంది హిందు వులు ఉన్నారు..? 20 శాతం మంది ముస్లింలు ఉన్నారని, ఈ ఉప ఎన్నికలో హిందువులు గెలుస్తారా..? ము స్లింలు గెలుస్తారా..? రెచ్చగొట్టే విధం గా మాట్లాడరాని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 కాంగ్రెస్ పార్టీ ముస్లింల వై పు ఉంది. బీజేపీ హిందువుల వైపు ఉంది. బస్తీమే సవాల్. హిందూ రా జ్యాం రావాలంటే జూబ్లీహిల్స్‌లో హిందువలంతా ఒక్కటై బీజేపీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలం గాణను ఇస్లాం రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది అని బండి సం జయ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.