calender_icon.png 26 August, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం

26-08-2025 12:41:25 AM

నిరుద్యోగ యువతను నమ్మించి రూ.72 లక్షల వరకు మోసం చేసిన తేజవత్ అనీల్

ఏటూరునాగారం, ఆగస్టు 25,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి రూ.72 లక్షల వరకు మోసం చేసిన నిందితుడు తేజవత్ అనీల్ నాయక్ అలియాస్ కేతన్ (ఖమ్మం జిల్లా, కవిరాజ్ నగర్) ఏటూరునాగారం పోలీసుల చెరలో చిక్కాడు. సోమవారం నిందితుని అరెస్టు వివరాలను ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ మీడియాకు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కె.తిరుపతి రావు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా అతడు తేజవత్ అనీల్ నాయక్ అని తేలింది. వెంటనే సమాచారం అందుకున్న వెంకటాపురం సి.ఐ అక్కడకు చేరుకొని కేసు నంబర్ 163/2025 యు/ఎస్420 ఐపిసిలో నిందితున్ని నిర్ధారించి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.

2019లో వెంకటాపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళకు ట్రాన్స్కోలో ఉద్యోగం ఇప్పిస్తానని నఖిలీ ఐడీ కార్డులు,నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు చూపించి మోసం చేశాడని, ఆమె పరిచయాల ద్వారా మరికొందరిని నమ్మించి 2020-2022 మధ్యకాలంలో కలిపి రూ.72 లక్షల నగదు వసూలు చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత బాధితులు పలుమార్లు కలవడానికి ప్రయత్నించినా అతను తప్పించుకు తిరిగినట్లు పేర్కొన్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు ఆగస్టు 16న కేసు నమోదుఱగగూ కాగా, ప్రస్తుతం మళ్లీ రెండు నకిలీ ఉత్తర్వులతో ప్రజలను మోసం చేయడానికి వచ్చిన అతడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం అధికారిక వ్బుసైట్ల ద్వారానే ప్రకటిస్తారు. వ్యక్తులు లేదా ఏజెన్సీలు హామీ ఇస్తామని చెప్పి డబ్బులు అడిగితే నమ్మొద్దు. మోసపూరిత వ్యక్తుల వలలో పడకండి. ఎవరికైనా ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు.