26-08-2025 12:42:27 AM
భీమదేవరపల్లి ,ఆగస్టు 25 (విజయక్రాంతి): భీమదేవరపల్లి మండల శాఖ అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిష్టి బొమ్మ ను బిజెపి నాయకులు దహనం చేశారు .శ్రీనివాస్ మాట్లాడుతూ మహేష్ కుమార్ కు పిచ్చి లేసి మాట్లాడుతున్నారని అన్నారు.
ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకోవాలని డిమాండ్ చేసారు. పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లో 63 MLA లు గా 8 మంది ఎంపీ లు గా గెలిచినప్పుడు దొంగ ఓట్ల తో గెలిచినట్టు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ రాష్టం లో బీజేపీ నీ బద్నామ్ చేస్తూ పబ్బం గడుపుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ప్రజలకు అందుబాటులో ఉంటు పార్లమెంట్ నియోజకవర్గం లో వేలకోట్లు రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే కనబడడం లేదా అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, దుర్గసింగ్, అయిత సాయి, దొంగల రాణా,ములుగు సంపత,కంకల సదానందం. సింగం రాజేందర్, కొక్కిస వైకుంఠం, సోప్పరి నవీన్, జక్కనపెల్లి శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు.