12-08-2025 03:25:48 PM
ఎస్బిఐ బ్యాంక్ ముందు న్యాయం చేయాలంటూ డ్వాక్రా మహిళల ఆందోళన
యాచారం: ఫోర్జరీ సంతకాలతో అమాయక మహిళలకు కుచ్చుటోపి వేసిన సంఘటన యాచారం మండల కేంద్రంలోని చౌదర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొదుపు సంఘాలు గౌరి, తిరుమల, దుర్గ బాయి, హారతి, సాయిరాం, మల్లన్న, శ్రీనిధి, మణికంఠ, డ్వాక్రా గ్రూపులతో పాటు దాదాపు 35 మంది మహిళా గ్రూపుల సభ్యులకు తెలియకుండానే వారి సంతకాలను ఫోర్జరీ చేసి, దాదాపుగా ఒక కోటి వరకు స్వాహా చేసినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమకు న్యాయం చేయాలని ఎస్బీఐ బ్యాంకు ముందుబ్యాంకు సేవలను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ప్రతి నెల బ్యాంకుకు వెళ్లి డబ్బులు చెల్లించి తాము తీసుకున్న అప్పును మొత్తం కట్టేసిన ఇంకా తీరలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని తాము చెల్లించిన స్లిప్పులపై స్టాంపు మేము వెయ్యలేదని అధికారులు అంటున్నారని బుక్ కీపర్ గడల వరలక్ష్మి బ్యాంకు మేనేజర్ కలిసే నిధులను స్వాహా చేశారని విమర్శిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.