calender_icon.png 13 August, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంథే 2025ను ప్రారంభించిన ఆకాష్ ఎడ్యుకేషన్

12-08-2025 05:40:00 PM

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): నాణ్యమైన విద్యను అందరికీ అందించే లక్ష్యంతో ఆకాష్ ఎడ్యుకేషన్ సంస్థ(Aakash Education Institute) ఆంథే 2025ను ప్రారంభించింది. నిర్వాహకులు మాట్లాడుతూ, 250 కోట్ల విలువైన 100% వరకు అలాగే 2.5 కోట్ల నగదు స్కాలర్షిప్లు క్లాస్ రూమ్ ఆకాశ్ డిజిటల్, ఇన్విక్టస్ కోర్సులకు బహుమతులు ఇవ్వబడతాయన్నారు. ఇది వైద్యం లేదా ఇంజనీరింగ్ రంగాల్లో విజయవంతమైన కెరీర్ కలలు కంటున్న విద్యార్థులకు ఆ అవకాశాలను అందిస్తుందన్నారు. ప్రతిష్టాత్మకమైన ఆకాశ్ ఇన్విక్టస్ కోర్సులో స్కాలర్షిప్, అడ్మిషన్ కోసం నిర్వహించబడుతుందని అన్నారు.

ఆంథే 2025 కు నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, విద్యార్థులు నమోదు చేసుకోవచ్చన్నారు. లేదా దగ్గరిలోని ఆకాష్ సెంటర్కి వెల్లి పరీక్ష రుసుము 300/- (ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటికీ ఒకటే) చెల్లించాలని, ముందుగా దరఖాస్తు చేసిన వారికి 50% రాయితీ లభిస్తుందన్నారు. ఆన్లైన్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ పరీక్ష తేదీకి మూడురోజుల ముందు కాగా, ఆఫ్లైన్ పరీక్షకు ఏడు రోజులు ముందు దరఖాస్తు సమర్పించాలన్నారు. అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి ఐదు రోజుల ముందు జారీ చేస్తారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.