12-08-2025 03:29:35 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు అవసరానికి మించి ఎరువులు నిల్వ చేసుకోకూడదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తెల్కపల్లి మండల కేంద్రంలోని పిఏసిఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి విక్రయ కేంద్రం వద్ద నిల్వ సూచిక బోర్డు తప్పనిసరిగా ఉంచాలన్నారు. రైతులకు కాలం చెల్లిన ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు. యూరియా సహా అన్ని రకాల ఎరువుల సరఫరా సమృద్ధిగా ఉందని ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.