12-08-2025 06:01:46 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువలు, నిర్వాసితులకు పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో భూసేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం కొరకు ఇరిగేషన్ శాఖ ద్వారా పెట్టిన భూసేకరణ ప్రతిపాదనలకు ఇప్పటి వరకు రెవెన్యూ, సర్వే అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
భూసేకరణకు సంబంధించి ఇంకా పెగ్ మార్కింగ్ చేయని వాటిని పెగ్ మార్కింగ్ చేయించడం, ఎంజాయ్మెంట్ సర్వే అయిన వాటికి అవార్డ్ పాస్ చేయాలని సూచించారు. కానాయపల్లి నిర్వాసితులకు పునరావాస కేంద్రం ఏర్పాట్లపై సైతం సమీక్షించారు. నిర్వాసితులకు అవసరమైన సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. కిమ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జి.సెక్షన్ సూపరిండెంట్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.