12-08-2025 05:44:05 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency) దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్ లో నివాసం ఉంటున్న శ్రీనురావు పెద్ద కుమార్తె శ్రీజ వర్మ(23) అమెరికాలోని చికాగోలో ఇస్టర్న్ ఇల్లినియస్ విశ్వవిద్యాలయం(Eastern Illinois University)లో ఎంఎస్ పూర్తి చేసింది. సోమవారం రాత్రి భోజనం కోసం అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్ కు నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుండి ట్రక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే కార్లే హాస్పిటల్ తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఉన్నత విద్య కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.