12-08-2025 05:55:57 PM
కరీంనగర్ (విజయక్రాంతి): బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కలాం స్టార్టప్ యూత్ అవార్డు(Dr. Kalam Startup Youth Award) ప్రోగ్రాంలో రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ, 2024లో బిజెపి మైనార్టీ ఫ్రంట్ ద్వారా స్థాపించిన ఈ అవార్డు భారతదేశ మాజీ రాష్ట్రపతి, క్షిపని మనిషి, దర్శనికులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారసత్వాన్ని గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ ప్రోగ్రాం ద్వారా యువ ఆవిష్కరణలు, వ్యవస్థాపకులను గుర్తించడానికి, ఆశయాలను ప్రేరేపించడానికి రూపొందించడం జరిగిందని తెలిపారు.
డాక్టర్ అబ్దుల్ కలాం కలలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువత పట్టుకున్న ఆశయాలకు అనుగుణంగా యువత సాధికారత, వ్యవస్థాపక అభివృద్ధిపై పరివర్తన విధానాలకు అనుగుణంగా, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బలమైన భారతదేశ కోసం కలాం స్టార్టప్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందన్నారు. అందులో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అర్హత కలిగిన ఎంతోమంది పోటీపడ్డారని , వీటిలో ప్రతిభావంతులైన ముస్లిం సమాజంతో సహా మైనార్టీ ర్గాలకు చెందిన 27 మంది యువకులకు కలాం అవార్డు ప్రధానం జరిగిందని ఆయన తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన మైనారిటీ మోర్చా నేతలు..
ఢిల్లీలో జరుగుతున్న కలాం స్టార్టప్ యూత్ అవార్డు ప్రోగ్రాంకు కరీంనగర్ నుండి దేశ రాజధానికి తరలి వెళ్లిన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్, ఉపాధ్యక్షులు బషీరుద్దీన్, కార్యదర్శి బల్బీర్ సింగ్ లు కేంద్రమంత్రి మండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.