12-08-2025 03:09:04 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 15న నిర్వహించడం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగళవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తా, పాత బస్టాండ్, కన్నాల బస్తి ప్రాంతాలలో బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు తనిఖీలను నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన పత్రాలను వెంట ఉంచుకోవడంతో పాటు తలకు హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
పట్టణంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటే ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, చదువుపై ఆసక్తిని పెంచుకోవాలని కోరారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మారం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఎక్కడైనా గంజాయి సేవిస్తూ, కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు. తనిఖీలలో ఎస్ఐలు రాకేష్, రామకృష్ణ లతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.