calender_icon.png 1 May, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసం

01-05-2025 12:46:28 AM

  1. దశలవారీగా లక్షల నగదు వసూలు 

అదుపులోకి తీసుకున్న హయత్ నగర్ పోలీసులు

ఎల్బీనగర్, ఏప్రిల్ 30 : ఎంబీబీఎస్ కళాశాలల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన వ్యక్తిని హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌సీటు ఇప్పిస్తానంటూ రూ. 52 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని  హయత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు గౌడ్, బాధితుడు బాలునాయక్ వివరాల ప్రకారం..

హయత్‌నగర్ పరిధిలోని గౌతమ్‌నగర్‌కు చెందిన కుక్కడపు చంద్రకాంత్ గౌడ్(37) అలియాస్ టింకూ బాయ్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన పల్లి గ్రామానికి చెందిన  ముడావత్‌బాలు నాయక్‌కుమారుడు  సంతోష్‌చౌహాన్( ఎంబీబీఎస్‌చదివే విద్యార్థి) తో  వనస్థలిపురంలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో  మూడేళ్ల క్రితం చంద్రకాంత్‌గౌడ్ కరీంనగర్‌లోని  చెలిమెడ మెడికల్ కాలేజీలో  సంతో ష్‌చౌహాన్ కు ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్‌కోటా సీటు ఇప్పిస్తానని అతడి తండ్రి బాలునాయక్‌తో  రూ. 98 లక్షలకు   ఒప్పందం చేసుకున్నారు. 

ఒప్పందం ప్రకారం.. విడతల వారీగా బాలునా యక్‌చంద్రకాంత్‌గౌడ్ అతడి భార్య ఉమారాణికి రూ. 52 లక్షలు చెల్లించారు. కానీ సంతోష్ చౌహాన్‌కు గవర్నమెంట్‌కౌన్సెలింగ్‌లోనే ఎంబీబీఎస్ సీటు రావడంతో ..  మేనేజ్‌మెంట్‌కోటా సీటు అవసరం లేదని, తాము ఇచ్చిన నగదు తమకు తిరిగి ఇవ్వాలని కోరారు.  చంద్రకాంత్‌గౌడ్ తీసుకున్న  రూ. 52 లక్షలలో నుంచి రూ. 26 లక్షలు తిరిగి బాలు నాయక్‌కు ఇచ్చారు.   

మిగతా రూ. 26 లక్షలు ఇవ్వకుండా మూడేండ్లుగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రశ్నించినా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు తనకు అధికార పార్టీ పెద్దలతో సంబం ధాలు ఉన్నాయని బెదిరిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్బీనగర్‌కాంగ్రెస్‌నాయకులతో  కలిసి దిగిన ఫొటోలను  బాధితులకు చూపిస్తూ  .. మీరు ఏమీ చేయలేరని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. 

మంగళవారం హయత్‌నగర్‌పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే  హయత్‌న గర్‌పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.  కోర్టు సూచన మేరకు నిందితుడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సీఐ నాగరాజు గౌడ్‌తెలిపారు.