calender_icon.png 1 May, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ‘మ్మత్తు’లోకి మైనర్లు!

01-05-2025 12:46:32 AM

  1. అర్ధరాత్రిళ్ళ వరకు ఇంటికి చేరకుండా వింత చేష్టలు
  2. సైకిల్ టైర్ రిపేర్ చేసే సొల్యూషన్ గమ్‌కు బానిసలు 
  3. ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు
  4. పోలీస్ స్టేషన్ వేదికగా కౌన్సెలింగ్ 

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): అభం శుభం తెలియని పసిపిల్లలు ఇంట్లో ఉండే వస్తువులను ఎలా వాడా లో తెలియక ప్రమాద బారిన పడుతున్నారు. సైకిల్ రిపేర్ చేసే సొల్యూషన్ గమ్ వాసన పీలుస్తూ మత్తుకు బానిసగా మారి అనారోగ్య పాలవుతున్నారు. ఫెవికాల్,  పెట్రోల్, సొల్యూషన్ వంటి గమ్ము పదార్థాలను ఇంట్లో విరివిగా దొరికే సామాగ్రి తో చిన్నారులు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సుమారు 30 మందికి పైగా 12 ఏళ్ల లోపు పసిపిల్లలు సైకిల్ ట్యూబ్ అతికించే సొల్యూషన్ గమ్ వాసన పీలుస్తూ మత్తులోకి జారుకుంటూ దానికి బానిసలుగా మారారు. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని వాసన పిలుస్తూ అర్ధరాత్రిల్ల వరకు ఇంటికి చేరకపోవడంతో వారి వారి తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. చివరికి కొంతమంది చిన్నారులు మత్తుకు బానిసలుగా మారి అనారోగ్య పాలవడంతో ఆసుపత్రికి వెళ్లిన ఆ తల్లిదండ్రులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో చిన్నారులు ఈ మత్తులోకి జారుకుంటున్నారని ఆలస్యంగా గుర్తించారు. 

తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్..

విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ పోలీసులు రంగంలోకి దిగి సదరు చిన్నారులను స్టేషన్కు పిలిచి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. కిటికీలు, తలుపులు, మంచాలు తయారు చేసేందుకు వినియోగించే ఫెవికాల్‌తో పాటు ఇతర గమ్ పదార్థాల్లో పెట్రోల్ సంబంధించిన కెమికల్ వినియోగించడంతో అట్టి వాసన ఒకసారి పిలుస్తూ పదేపదే పీల్చడంతో దానికి అలవాటు పడుతున్నారని ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.