calender_icon.png 10 July, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సమస్యలకు చెక్

09-07-2025 09:47:51 PM

కొత్తగా 8 సబ్ స్టేషన్లు ఏర్పాటు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 8 సబ్ స్టేషన్ లు మంజూరు అయ్యాయని, పనులు  ముమ్మరంగా జరుగుతున్నాయాని ఎస్ ఈ పి.విజేందర్ రెడ్డి తెలిపారు. విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్ లు నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఎటువంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని వివరించారు. మౌలిక వసతుల అభివృద్ధికి అనుగుణంగా కొత్తసబ్ స్టేషన్ ల ఏర్పాటుతో రైతులకు, వినియోగదారులకు అంతరాయాలు తగ్గుతాయని స్పష్టం చేశారు.

సుదూరమైన ఫీడర్లు ఉండవని, ఫీడర్ నష్టాలు తగ్గుతాయని తెలిపారు. ఉన్న సబ్  స్టేషన్ల పై  భారం తగ్గుతుందని, తద్వారా మెరుగైన, నిరంతరాయమైన విద్యుత్తు సరఫరా చేయడానికి అనువుగా ఉంటుందని తెలిపారు. నూతన సబ్  స్టేషన్ ల వలన,  నూతన వ్యవసాయ కనెక్షన్ లు త్వరిత గతిన మంజూరు అయ్యే  అవకాశం ఉంటుందన్నారు. కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లలో ఎస్.సీ.ఏ.డీ.ఏ అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికతను అమలు చేయడం జరుగుతుందని, రియల్ టైం ఫీడర్ మానిటర్ ఉంటుందని, విద్యుత్ సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకునే వీలుంటుందన్నారు.