09-07-2025 08:34:05 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో లీలా గార్డెన్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖల మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క(Minister Seethakka) పుట్టినరోజు సందర్భంగా నేతకాని మహర్ కుల హక్కుల పోరాట సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు ఆధ్వర్యంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో మంత్రి సీతక్కను సత్కరించడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేగ కళ్యాణిని అభినందిస్తూ శాలువతో సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నేతకాని కుల సంఘం రాష్ట్ర నాయకులు దుర్గం శేఖర్,జాడి వెంకటేశ్వర్లు,జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ సునారికాని రాంబాబు,రాష్ట్ర నాయకులు గోగు సుధాకర్,దుర్గం ప్రభాకర్,సునారికాని సాంబశివరావు,జనగాం దుర్గరావు,దుర్గం రామ్మూర్తి,సునార్కని సురేందర్ మరియు జిల్లా మీడియా ఇంచార్జీ బసారికారి నాగార్జున్ పాల్గొన్నారు.