09-07-2025 08:47:00 PM
కొత్తకోట: వనపర్తి జిల్లా(Wanaparthy District) కొత్తకోట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) శాఖ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తకోట మున్సిపాలిటీలో మహా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీలో ఉన్న అన్ని కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు సాయిబాబు, అజయ్ మాట్లాడుతూ.. 1949 జులై 9 నాడు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థిని విద్యార్థులతో ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా ఏర్పడిందని గుర్తు చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేస్తు విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వేంటనే పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుందని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు చేయడంలో ఎన్నో ఏళ్లుగా ఎబివిపి ఉద్యమం ఫలితంగా రద్దయ్యింది నేడు అక్కడ వున్న ప్రజలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారు అని, విద్యా జాతీయకరణ కావాలని ఆనాడు గోడ మీద రాసిన రాతలు నేడు పార్లమెంట్ లో చట్టమై అమలులోకి వచ్చి నూతన జాతీయ విద్యా విధానం ప్రారంభం అయ్యిందని గుర్తు చేశారు. మాతృ భూమికి సేవ చేయడం విద్యార్థులుగా మన అందరి కర్తవ్యం అని విద్యార్థి పరిషత్ ఉద్యమాలలో అందరూ భాగస్వాములు కావాలని ఈ దేశం కోసం పనిచేసే విద్యార్థి పరిషత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పవన్, సోనూ, శివ, శంకర్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.