calender_icon.png 9 July, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాల గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన వైద్యాధికారి డాక్టర్ అభినవ్

09-07-2025 08:37:27 PM

12 మందికి రక్త పరీక్షలు..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య ఉపకేంద్రం, కన్నాయిగూడెం పరిధిలోని చిట్యాల గ్రామంలో వైద్య శిబిరాన్ని వైద్యాధికారి డాక్టర్ అభినవ్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసి రక్త పరీక్షలను నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షలు నిర్వహించిన 52 మందిని డాక్టర్ పరీక్షించారు. అందులో 12 మందికి రక్త పరీక్షలు చేయగా వారికి మలేరియా నెగిటివ్ గానే ఉంది, ఇద్దరినీ బీపీతో బాధపడే వారిని, థైరాయిడ్ తో బాధపడే వారిని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేయడం జరిగింది. ఇందులో ఇంటింటికి సర్వే చేయడం ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొనడం, పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇందులో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పోషకాహార విలువలను గురించి వివరించడం జరిగింది ఇందులో నీతి అయోగ్ రవీష్,హెల్త్ ఎడ్యుకేటర్ సుజాత ఫార్మసిస్ట్ ఆఫీసర్ శారద ఎన్ సి డి నర్సింగ్ ఆఫీసర్ అజ్మీరీ,హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్ పాల్గొన్నారు.