calender_icon.png 10 July, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వాలి

09-07-2025 08:55:55 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ఆర్డిఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. బెల్లంపల్లి పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇప్పటికి ఊసే లేదని విమర్శించారు. పట్టాలు కూడా ఏళ్ల తరబడి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళనకారులు అధికారులపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్లపట్టాలు కూడా త్వరితగతిన ఇవ్వాలని కోరారు. అనంతరం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ(RDO Harikrishna)కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, పట్టణ అధ్యక్షురాలు ధార కళ్యాణి, పట్టణ ప్రధాన కార్యదర్శి కునిరాజుల అరవింద్, తాండూరు మండల ఇన్చార్జ్ మద్దర్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు వేల్పుల రాజయ్య, వడ్నాలస్వామి, జీదుల రాములు, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్, పట్టణ కోశాధికారి సంతోష అగర్వాల్, ఎర్రోజు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.