calender_icon.png 10 July, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణంలో అట్టహాసంగా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు

09-07-2025 08:42:02 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ క్రీడా మైదానంలో బుధవారం అండర్-13 బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు(State Level Football Championships) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని 7 జిల్లాలకు చెందిన 170 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవి హాజరై క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవి మాట్లాడుతూ... క్రీడల వల్ల స్నేహభావం, ఐక్యత పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాల్గుణ, సిఐ శశిధర్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు తదితరులు పాల్గొన్నారు.