calender_icon.png 9 July, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష 20 వేల బోధనా పరికరాల పంపిణీ

09-07-2025 08:27:01 PM

గజ్వేల్: గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రూ. లక్ష 20 వేల విలువైన బోధనా పరికరాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గందని శ్రీనివాస్(Gandani Srinivas) మాట్లాడుతూ... బాగా చదివి భవిష్యత్తులో విద్యార్థులంతా సహాయం తీసుకునే స్థాయి నుంచి సహాయం చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. పూర్వ ట్రెజరర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. తన కూతురు ఉష సహకారంతో ప్రతి సంవత్సరం రూ. కోటి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు సమాజ అభివృద్ధికై సేవలందిస్తున్నామని తెలిపారు. మున్ముందు పాఠశాల అభివృద్ధికి కావలసిన అన్ని రకాల అవసరాలను తీర్చడానికి లయన్స్ క్లబ్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిఎంటి కోఆర్డినేటర్ లయన్ పరమేశ్వర చారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరీముద్దీన్, లయన్స్ క్లబ్ గజ్వేల్ విస్డం ప్రెసిడెంట్ బాలు చరణ్, సంజయ్ గుప్తా, లయన్ మల్లేశం గౌడ్, రాంఫణిధర్, కిష్టయ్య, కుమారస్వామి, శ్రీనివాస్ గౌడ్, విజయభాస్కర్, పాఠశాల ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.