17-09-2025 09:54:27 PM
పెన్ పహాడ్: రోటరీ క్లబ్ ఆఫ్ చేంజ్ మేకర్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ సహకారంతో బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనిరెడ్డిగూడెంలో ఉచిత క్యాన్సర్ పరీక్షల క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంప్ ను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ సంస్థ మారుమూల ప్రాంతాలను కూడా ఎంచుకొని పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన 100 మందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిమిత్తం ల్యాబ్ పంపి రోగ నిర్ధారణ వారికి ఉచిత వైద్య సేవలు అందించినట్లు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు.