17-09-2025 11:14:45 PM
చిన్న చింతకుంట: మండలంలో రెండు రోజులుగా ఎస్ జి ఎఫ్ క్రీడల పోటీలను లాల్ కోట జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులుగా మండలంలోని వివిధ పాఠశాలల చెందిన అండర్ -17, అండర్- 14 కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలలో క్రీడాకారులు ఎంతో చక్కని ప్రదర్శన ఇచ్చారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎస్జిఎఫ్ కన్వీనర్, మండల విద్యాధికారి మురళీకృష్ణ, ఎస్జీఎఫ్ నిర్వహణ కమిటీ ట్రోఫీలను బహుమతి ప్రధానం చేశారు.
బాలికల విభాగంలో అండర్ 17 కబడ్డీ లో జెడ్పిహెచ్ఎస్ (లాల్ కోట), ప్రథమ బహుమతి, అండర్ -14 వాలీబాల్ పోటీలలో (లాల్ కోట) ద్వితీయ బహుమతులు సాధించారు. బాలుర విభాగంలో వాలీబాల్ పోటీలో జడ్పీ ఉన్నత పాఠశాల (వడ్డెమాన్) బాలికల విభాగంలో వాలీబాల్ పోటీలో కేజీబీవీ (సీసీ కుంట) ప్రథమ బహుమతి సాధించారు. బాలుర విభాగంలో కబడ్డీ పోటీలో జడ్పి ఉన్నత పాఠశాల (బండ ర్ పల్లి) ప్రథమ బహుమతి బాలికల విభాగంలో కేజీబీవీ (సీసీ కుంట) విద్యార్ధులు విజయం సాధించారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి మురళి కృష్ణ మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఆయన కోరారు. క్రీడాకారులను వెలికి తీసేందుకే ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు ఈ మండల స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాణ కమిటీ, వ్యాయామ ఉపాధ్యాయులు రాఘవేందర్, శ్రీనివాసులు, రాజుచింతకుంట రాఘవేందర్, ప్రసన్న మమతలను మండల విద్యాధికారి ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.