calender_icon.png 18 September, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధిదీపాలు లేక చీకటిగా మారిన వీధులు

17-09-2025 11:09:40 PM

విధి దీపాలు ఏర్పాటు చేయాలి... శివ్వంపేట గ్రామస్థుల డిమాండ్

శివ్వంపేట,(విజయక్రాంతి): శివ్వంపేట మండల కేంద్రంలో రాత్రివేళలలో చీకటి చుట్టుముట్టుతోంది. ప్రధాన వీధులు, కాలనీలు, రహదారులపై వీధిదీపాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రాత్రి సమయంలో నడిచేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

రామాలయం వద్ద ఉన్న ప్రమాదకరమైన కోనేరు వద్ద కూడా దీపాలు లేకపోవడంతో ప్రజలు వెళ్ళడానికి భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో రోడ్లపై పాములు, కీటకాలు తిరుగుతుండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు సమస్యను పట్టించుకోవడంలేదని ఆరోపించిన ప్రజలు, వెంటనే వీధిదీపాలను ఏర్పాటు చేసి గ్రామంలో సురక్షిత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.