17-09-2025 11:38:16 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని ఆర్.ఎస్.ఎస్ నల్లగొండ విభాగ్ ప్రచారక్ సత్యం పిలుపునిచ్చారు. బుధవారం గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి మోడల్ స్కూల్లో ఇటీవల నిర్వహించిన గోవిజ్ఞాన పరీక్షల్లో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి వ్యవసాయం, రైతులే వెన్నుముకని గుర్తు చేశారు.
విద్యార్థులు చెట్లు నాటడం,పెంచడం, నీటీ వినియోగం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి విషయాలలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు. రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, కావున యువకులు సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని కోరారు. మనిషి, ప్రకృతి, జంతువులు పరస్పరం దగ్గరగా ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. అనంతరం విధ్యార్ధులకు నగదు బహుమతులు, మెమెంటోలు అందజేశారు.