17-09-2025 10:57:49 PM
చండూరు,(విజయక్రాంతి): బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలో మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంచార్జ్ జిల్లా నాయకులు బొడిగ అశోక్ గౌడ్ మాట్లాడుతూ 1947లో బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఎందరో తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాలతో, సర్ధార్ వల్లభభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాం నవాబ్ కబంధ హస్తాల నుండి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచనం వచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గతంలో బి ఆర్ యస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రానున్నది బిజెపి ప్రభుత్వమేనని అప్పుడు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.