calender_icon.png 18 September, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి

17-09-2025 11:28:33 PM

జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు చైర్మన్ దీపక్ తివారి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు చైర్మన్ దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు చైర్మన్ మాట్లాడుతూ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని, సి.సి.ఈ. నివేదికలు నిర్వహించాలని తెలిపారు. కనీస అభ్యాసన సామర్ధ్యాల సాధనే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి పాఠశాలకు మాధ్యమాల వారీగా ప్రశ్నాపత్రాలు చేరేలా మండల నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సకాలంలో డి.సి.ఈ.బి. రుసుము చెల్లించాలని తెలిపారు.