calender_icon.png 17 September, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ సెలబ్రేషన్స్

17-09-2025 09:51:12 PM

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలో తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రేణుక ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టారు. అనంతరం విద్యార్థులకు ఫ్రెషర్స్ డే కార్యక్రమంను జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రేణుక మాట్లాడుతూ... విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని దాని కనుగుణంగా నడుచుకున్నప్పుడే విజయతీరాల వైపు వెళ్తారని విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు.

అనంతరం అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు సత్ప్రవర్తనను కలిగి ఉండాలని అప్పుడే విజయం వారిని వరిస్తుందని పేర్కొన్నారు. తర్వాత ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సిహెచ్ వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, వారు సాగించిన భూ పోరాటమును విద్యార్థులకు వివరించారు. తెలంగాణలో అమరులైన అమరుల సాక్షిగా వారి అడుగుజాడల్లో నడిచి అభివృద్ధి చెందిన తెలంగాణను సాధించాలని విద్యార్థులకు ఉద్బోధించారు.