17-09-2025 09:59:15 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): డిజిటల్ విద్యా విధానంలో విద్యార్థులు సులభంగా విద్యను అభ్యసించవచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా విద్యా శిక్షణా కేంద్రం, కొత్తగూడెం నందు జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 8 ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకు మరియు 2 భవిత సెంటర్ ల ఐఈఆర్ పిలకు సిఎఎస్ఆర్ పథకం కింద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారు కేవైఏఎన్ ప్రొజెక్టర్ (డిజిటల్ బోధనా పరికరాలు)లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా అంద జేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ లో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు ప్రత్యేకంగా భద్రాద్రి జిల్లాలో రూ 25 లక్షల విలువ చేసే బోధనా పరికరాలను అందజేసినందుకు వారికి అభినందనలు తెలియజేశారు. ఈ పరికరాలను సంబంధిత పాఠశాలల వారు విద్యార్థులకు ఉపయోగపడేలా బోధనలో సద్వినియోగ పరుచుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అంతేకాకుండా రానున్న కాలంలో మన జిల్లాలోని సుమారు 250 పాఠశాలలకు కూడా ఇదే విధంగా కేవైఏఎన్ లను మంజూరు చేయమని, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారికి ప్రతిపాదించామని కలెక్టర్ తెలియజేశారు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చొరవతో ఈ జిల్లాకు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా సహకారం అందిస్తామని అన్నారు.