calender_icon.png 18 September, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలం

17-09-2025 11:34:14 PM

కొమురవెల్లి: గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పూర్తిగా విఫలమైందని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎరుపుల మహేష్ అన్నారు. గ్రూప్ వన్ పరీక్షల పై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ ప్రభుత్వం కోర్టు ఇచ్చిన తీర్పుకు బాధ్యత వహించి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించి, వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆయన సూచించారు. తక్షణమే జీవో నెంబర్ 29 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.