06-09-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): అలింకో వారి సౌజన్యoతో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకు నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి లింగాపురం రాజు తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత దివ్యాంగ వైకల్య నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఓ లింగాపురం రాజులు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని (ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట్, లింగంపేట్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ ) ఆయా మండలాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కోసం ఉచిత దివ్యాంగ అంగవైకల్యం నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న 1 నుండి 18 సంత్సరాలు గల దివ్యాoగ, విద్యార్థిని విద్యార్థులు ఇట్టి ఉచిత నిర్ధారణ శిబిరానికి వినియోగించుకోవాలని సూచించారు.
ఉదయం 9 గంటల 30 నిమిషాలకు నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు శిబిరం కొనసాగుతుందని ఈ శిబిరానికి వచ్చేటప్పుడు తీసుకరావల్సిన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్ గల ఫోటోలు, సదరం సర్టిఫికెట్, యు డి డి కార్డు , రేషన్ కార్డు, ఆదాయ ధ్రువ పత్రము, ఆధార్ కార్డు తీసుకుని రావాలని తెలియజేశారు, వైకల్యం ఉన్న విద్యార్థిని విద్యార్థులను గుర్తించి వారికి హియరింగ్ మిషన్లు, కాలిపర్స్, ట్రై సైకిల్లు, విల్ చైర్లు మొదలగు పరికరాలను అందజేస్తారని తెలిపారు.