06-10-2025 06:34:28 PM
మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి బుద్ధ నగర్ లో ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శంషాబాద్ సాయిరాం రెడ్డి విజయ నేత్రాలయం ఆస్పత్రి వారి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి హాజరైన వారికి పలు రకాల కంటి పరీక్షలను నిర్వహించి మందులను, కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఫౌండేషన్ ను స్థాపించి గత రెండు సంవత్సరాలుగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సారి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించామని సాయిరాం రెడ్డి తెలిపారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించడానికి సైతం సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ శిబిరంలో విజయ నేత్రాలయ వైద్యులు సుష్మారెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.