calender_icon.png 26 October, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కండర క్షీణత వ్యాధి గ్రస్తులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

26-10-2025 07:47:48 PM

ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ నిత్యవసర ఆర్గానిక్ వస్తువుల పంపిణీ

కృతజ్ఞతలు తెలిపిన మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్, టిఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్.

పటాన్ చెరు: కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం 18వ వార్షికోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇందిరమ్మ కాలనీలోని రామాలయం ప్రాంగణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 23 మంది కండర క్షీణత వ్యాధి బాధితులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హిమబిందు, రామ్ రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శిరీష, జగదేవి, మణికుమార్, సుధీర్, కొత్తపల్లి నరసింహులు, నవీన్ లు కలిసి 23 మంది కండర క్షీణత వ్యాధి బాధితులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల విలువచేసే ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కండర క్షీణత వ్యాధి బాధితులకు తమ వంతు సహాయంగా ప్రతి సంవత్సరం సరుకులు అందించడం తమకెంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. కండర క్షీణత వ్యాధి గ్రస్తులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మడపతి రవికుమార్ ఆలోచనలు ఎంతోమంది దివ్యాంగులకు మార్గ నిర్దేశం అవుతాయని అభినందించారు. భవిష్యత్తులో తాము ఎల్లవేళలా కండర క్షీణత వ్యాధి గ్రస్తులకు తమ వంతుగా అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మేరా ఇండియా సోషల్ సర్వీస్ ఇస్నాపూర్ సభ్యులు‌ మడపతి రవికుమార్ ను ఘనంగా సత్కరించి తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందజేశారు.

నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ కృతజ్ఞతలు

కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మడపత్తి రవికుమార్. 

తనకున్న అంగవైకల్యాన్ని ఆయుదంగా మార్చుకొని గత 18 సంవత్సరాల క్రితం ఒంటరిగా ప్రారంభమైన తన ప్రయాణంలో నేడు ఎందరో గొప్ప, గొప్ప వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు, కార్పోరేట్ సంస్థల సభ్యులు భాగస్వామ్యమై తన ప్రయాణంలో తనకు తోడుగా సాగుతూ గత 18 సంవత్సరాలుగా కండర క్షీణత వ్యాధిగ్రస్తులకు ప్రతి సంవత్సరం నిత్యవసర సరుకులు అందించడం ఎంతో అభినందనీయమని తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్, టిఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ కృతజ్ఞత పూర్వక అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేరా ఇండియా సోషల్ సర్వీస్ ఇస్నాపూర్ సభ్యులు, పి ఆర్ టి యు రాష్ట్ర మహిళా నాయకురాలు వాకిటి శ్రీదేవి, ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటేష్, కృష్ణ, దివ్యాంగుల నాయకులు కంచిగారి మహేష్, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.