28-07-2025 12:24:38 AM
-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి, జూలై 27:గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదోడ్డిలో సేవాభారతి ఎల్సిహెచ్ గ్రీన్ ల్యాండ్స్ డా.ఈశ్వర్ చందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఎలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులుపాల్గొన్నారు.