28-07-2025 12:25:54 AM
జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్
భద్రాద్రికొత్తగూడెం, జూలై 27 (విజయ క్రాంతి):హైదరాబాద్ షేక్ పేట్ లో జరిగిన రాష్ట్ర స బ్ జూనియర్స్ బాక్సింగ్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు ఎనిమిది పతకాలు సాధించారని జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ షేక్ పేట్ లో ఈ నెల 25 నుండి 27 వరకు జరిగిన రాష్ట్ర బాక్సింగ్ సబ్ జూనియర్స్ బాలురు,బాలికల విభాగాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరుపున పాల్గొన్న క్రీడాకారులకు మూడు రజత, అయిదు కాంస్య పతకాలు సాధించారని తెలిపారు.
పతకాలు సా దిం చిన వారిలో ఎ.ప్రవళిక,ఏం.హనిత్య శ్రీ,కె.అరుణ్ కృష్ణ రజత పతకాలు సాధించగా కె.శర ణ్య, కె.అమృత వర్షిణి,ఓ.సెహర్ష్ మహంత్, వి.సాయి కిరణ్,ఆర్.గణేష్ లు కాంస్య పతకాలు సా ధిం చ రని వారికి కోచ్ లుగా జి.ఈశ్వర్,నేహసింగ్ వ్యవహరింవారన్నారు.
క్రీడాకారులతో పాటు జి ల్లా బాక్సింగ్ అధ్యక్షులు ఉదయ్ బండారి, జిల్లా ఊపాధ్యక్షు డు ఎండీ.షమీ ఉద్దీన్,జిల్లా వర్కిం గ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, జిల్లా కార్యదర్శి వై. శివ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులనుబాక్సింగ్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లయ్య బండారి, జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి పరందమరెడ్డి లు అభినందించారు