calender_icon.png 1 January, 2026 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు

01-01-2026 12:00:00 AM

చౌటుప్పల్, డిసెంబర్ 31(విజయ క్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో ఉచిత బిపి, షుగర్, పరీక్షలు  బంగారిగడ్డ మసీదు నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షులు తిరందాస్ జగన్నాథ్ మాట్లాడుతూ సమతుల్యం లేని ఆహారం తీసుకోవడం వల్ల పని ఒత్తిడి రిత్య ప్రజలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యాన్ని పట్టించుకోక చాలామంది పేదలు అనారోగ్యాలకు గురవుతున్నారు కావున లైన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల సేవ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో ఉచితంగా బిపి, షుగర్, పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలందరినీ ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి సూచనలు సలహాలు ఇస్తున్నామని అన్నారు.

అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వలిగొండ రోడ్డులో ఉచిత కంటి ఆసుపత్రి ద్వారా ప్రతి ఆదివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తిరందాసు జగన్, సెక్రెటరీ అత్తర్ పాషా, ట్రెజర్ మంగయ్య, లైన్ సభ్యులు కాసుల వెంకటేశం ,వేముల నరసింహ పాల్గొన్నారు.