01-01-2026 12:00:00 AM
రంగారెడ్డి,డిసెంబర్ 31( విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కెసిఆర్ ను మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఎర్రవెల్లిలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తనకు అవకాశం కల్పించిన సందర్భంగా ఆయనకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.