calender_icon.png 17 July, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య పరీక్షలు వేగవంతం చేయాలి

17-07-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, జూలై 16 (విజయ క్రాంతి): జమ్మికుంట సామాజిక ఆసుపత్రి పరిధిలో మహిళలందరికీ ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలు వేగవంతం చేయాలని, ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బుధవారం సందర్శించారు.అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హా ల్లో వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని, వైద్య సహాయం అవసరం అనుకుంటే గర్భిణీలను ప్రసవ గడువు కంటే ముందే ఆస్పత్రిలో చేర్చుకోవాలని అన్నారు. ప్రతి నెలా ఓపి, ఐపి, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య మహిళ, డెలివరీల నెలవారి నివేదికలను సిద్ధం చేసి పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ బాబు, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆడపిల్ల సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ సనాపాల్గొన్నారు.