16-07-2025 11:50:09 PM
చివ్వేంల,(విజయక్రాంతి): తమతో కలిసి ఉంటూ కష్టంలో సుఖంలో పాలుపంచుకున్న (విబిఎల్) పెప్సీ ఏఎస్ఎం వింజమూరు ప్రభాకర్ రెడ్డి అకాల మరణం చెందడంతో పెప్సీ కంపెనీ ఉద్యోగులు కుడకుడ గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాధ వృద్ధుల, వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. ఆయనతో కలసి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు.