calender_icon.png 6 December, 2024 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉచిత మెగా వైద్య శిబిరం

27-10-2024 08:16:02 PM

కాప్రా,(విజయక్రాంతి): చల్లపల్లి కేంద్ర కారాగారంలో వికాస తరంగణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి ఖైదీలు సిబ్బంది కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించారు. ఆదివారం కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంను జైల్ సూపరింటెండెంట్ రామచంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జైల్ సూపరింటెండెంట్ రామచంద్రం మాట్లాడుతూ... కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, జైల్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఖైదీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. సుమారు 950 మంది ఖైదీలు, 250 మంది సిబ్బంది కుటుంబ సభ్యులకు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులను పంపించేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రకారగారం డిప్యూటీ సూపరింటెంట్లు, వైద్యులు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, వార్డెన్లుతో పాటు వికాస తరంగణి  ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.