calender_icon.png 6 December, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన వ్యక్తుల్లో ఒకడిగా వైఎస్ఆర్ చరిత్రలో నిలిచిపోతాడు: ఎంపీ ఈటల రాజేందర్

27-10-2024 08:22:52 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): సమాజంలో ప్రతి సమస్యపై తనదైన శైలీలో స్పందించి చేయుతనందించే అరుడైన వ్యక్తుల్లో ఒకడిగా వైయస్ఆర్ చరిత్రలో నిలిచిపోతాడని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలంలో గ్రూప్-1 మెయిన్స్ పరిక్షలు రాస్తున్న 160 మంది అభ్యర్థులకు 7 రోజుల పాటు వసతి, భోజనాల ప్రాంగణాన్ని ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. రాష్ట్ర అత్యున్నత ఉద్యోగాలు గ్రూపు-1 కొరకు జరుగుతున్న ఉద్యోగార్థులకు అండగా నిలిచి వారికి స్టడీ మెటీరియల్, వసతి, భోజనాల సౌకర్యం కల్పించిన వైయస్ఆర్ కు ఈటెల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు పరిపాలనలో ప్రజల ఉన్నతి కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతు పుష్కర కాలం తర్వాత జరుగుతున్న ఉద్యోగ పరిక్షలలో ప్రతి ఒక్కరు విజయం సాధించాలనే లక్ష్యం తోనే తాను ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.