calender_icon.png 3 May, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐవీవై, సిద్ధార్థ పాఠశాలలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

03-05-2025 01:14:01 AM

కరీంనగర్, మే 2 (విజయ క్రాంతి): నగరంలో సీతారాంపూర్ లోని ఐ వి హై పాఠశాలలో, సిద్ధార్థ పాఠశాలలలో  వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రారంభించారు.   ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  మారుతున్న వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన మెరుగైన విద్యను విద్యార్థులు అభ్యసించడం ద్వారా  భవిష్యత్తులో వారికి ఎన్నో ఉపాధి అవకాశాలు అందుతాయని  పేర్కొన్నారు. 

పాఠశాల చైర్మన్ పసుల మహేష్ గారు మాట్లాడుతూ   పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా  ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన మెరుగైన విద్యను అందించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో  డిప్లమా కంప్యూటర్ అప్లికేషన్   శిక్షణను 30 రోజులు ఉచితంగా  బోధించడం జరుగుతుందన్నారు.  దీనిలో భాగంగా,  ఎమ్మెస్ వర్డ్, ఎక్సెల్,  నోట్, ఎమ్మెస్ ఆఫీస్, పవర్ పాయింట్,  ఫోటోషాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు సృజనాత్మకతతో, నైపుణ్యంతో ,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధించడం జరుగుతుందని పేర్కొన్నారు .

అంతేకాకుండా ప్రతిరోజు విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని , విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది లాస్ట్ ఎగ్జామ్స్  కలిమినేషన్ కూడా  కలెక్టర్  ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు .దాదాపు 80 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇంకా సోమవారం వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కో చైర్మన్ శ్రీ దాసరి శ్రీపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి,  పాల్గొన్నారు .