calender_icon.png 1 May, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

01-05-2025 01:00:03 AM

డీయండబ్ల్యూఓ అబ్దుల్ నదీమ్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): యూపీఎస్‌సిసిఎస్‌ఏటి 2026 (సివిల్ సర్వీసెస్) పరీక్ష కోసం 2025 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్, మైనా రిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీమ్ కుద్దుసి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ శిక్షణకు రిజర్వేషన్ల నియమం ప్రకారం మహి ళా అభ్యర్థులకు 33.33 శాతం సీట్లు, అన్ని రిజర్వుడ్ కేటగిరీలలో వికలాంగులకు 5 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. స్టడీ సర్కిల్‌లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులు ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపిక పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు.

సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ప్రవేశం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని ప్రొఫెషనల్/ సాధారణ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు మే 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో https://cet.cgg.gov. in, ww.tmreistelangana.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా మే 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల న్నారు.  జూన్ 5వ తేదీన జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.