01-05-2025 12:59:18 AM
చేవెళ్ల , ఏప్రిల్ 30: కరెంట్ షాక్ తో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కావాలి బాలామణి (50), వృత్తిరీత్యా కూలీ.
ఏప్రిల్ 20 న గ్రామంలోని పూజ ఫార్మ్ హౌస్లో కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురైంది. వెంటనే ఆమెను ప్రీమియర్ హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8:00 గంటల సమయంలో మరణించినట్లు డ్యూటీ డాక్టర్ తెలిపారు. ఈ ఘటనపై ఆమె అల్లుడు చౌదరిగూడెం రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .