24-07-2025 07:59:39 PM
స్మశాన వాటికకు ఫ్రీజర్ బాక్స్ వితరణ..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచలోని కేటీపీఎస్ స్వర్గధామం స్మశాన వాటికకు స్థానిక బాపూజీ నగర్ కు చెందిన చండ్ర చతుర్వేది, దుర్గాభవాని గురువారం ఫ్రీజర్ బాక్స్ ను వితరణగా అందజేశారు. కేటీపీఎస్ లో ఏడీఈ గా పని చేస్తూ గత ఏడాది మృతి చెందిన వారి తండ్రి చండ్ర ప్రేమసాగర్ రావు జ్ఞాపకార్థం సుమారు రూ.60 వేలు విలువచేసే ఫ్రీజర్ బాక్స్ ను అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ కోటేశ్వరరావు,బీ వెంకటేశ్వరరావులకు అందజేశారు. వీరు గతంలో స్మశానవాటిక ప్రాంగణంలో రూ.90 వేల వ్యయంతో షెడ్ నిర్మాణం చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి ఆరే శ్రీనివాస్ రావు, కార్యాలయ ఇన్చార్జ్ ఎస్ శివప్రసాద్, ఎస్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.