calender_icon.png 30 July, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎన్సీసీలో ఆరో రోజు శిక్షణ విజయవంతం

29-07-2025 08:16:18 PM

హన్మకొండ/కెయు క్యాంపస్ (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University)లో ఎన్సీసీ పదవ తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-6 ఆరో రోజు శిక్షణ కార్యక్రమాలు శ్రమతో కూడినవిగా కొనసాగాయి. ఈ క్యాంపును కమాండెంట్ కల్నల్ ఎస్.ఎస్. రామదురై పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు ఉదయం యోగాసనాలు, ఫిజికల్ ఫిట్నెస్, ప్రత్యేక డ్రిల్ శిక్షణలు నిర్వహించారు. అంతేకాకుండా రిపబ్లిక్ డే 2026 ఢిల్లీ పరేడ్ లో పాల్గొనబోయే వరంగల్ గ్రూప్ క్యాండెట్లు ఎంపిక ప్రక్రియ ఈరోజుతో పూర్తి చేయబడిందని ఇది లెఫ్ట్నెట్ కల్నల్ రవి సునారి ఆధ్వర్యంలో జరిగిందని కల్నన్ రామదురై వెల్లడించారు.

కాండేట్ల ఉత్సాహం, ఉల్లాహం కోసం సాయంత్రం వాలీబాల్, కోకో పోటీలు నిర్వహించి విజేతలకు చివరి రోజు బహుమతులు అందించనున్నామని తెలిపారు. క్యాంపు సమయంలో కాండేట్లకు కఠినమైన శిక్షణ అందిస్తున్నట్లు క్యాంపు కమాండెంట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ అడ్జస్ట్మెంట్ లెఫ్ట్నెట్ కలర్ రవి సునారి, కెప్టెన్ పి సతీష్, కెప్టెన్ డాక్టర్ సదానందం, సుబేదార్ మేజర్ జయరామ్ సింగ్, రవీందర్, అజిత్ కదం, గణేష్, రాధాకృష్ణ, రాజమాణిక్యం, సంధ్య, కళ్యాణి, అరుణ, కుమారస్వామి, దత్తు,సతీష్, మహేష్, మరియు ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల అధికారులు పాల్గొన్నారు.