29-07-2025 08:20:41 PM
కలెక్టర్, పీడీలకు ఫిర్యాదు చేసిన గుంటూరుపల్లి గ్రామస్తులు..
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల అవినీతిపై విచారణ జరిపించాలని ఆ గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma), పీడీలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులలో సుమారు 40 లక్షల రూపాయల అవినీతి జరిగిందని తెలిపారు. తమకు తెలియకుండా నిధులను మాజీ ప్రజా ప్రతినిధి సొంత అకౌంట్ కు మరలించుకున్నారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నెం శ్రీనివాస్ రావు,సదా శివ రావు,మెట్టు శేషగిరి రావు,శివ రామ కృష్ణ,ముద్దన నాగరాజు,శ్రీనివాస్,శ్రీకాంత్,ధనుష్,పువాటి హరికృష్ణ,సతీష్ తదితరులు ఉన్నారు.