24-07-2025 08:05:01 PM
ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం..
సదాశివనగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం(Inter-Nodal Officer Sheikh Salam) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా షేక్ సలాం మాట్లాడుతూ, అడ్మిషన్ల సంఖ్య పెంచే విధంగా అధ్యాపకులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు 97 అడ్మిషన్లు జరగగా అడ్మిషన్ల సంఖ్య 120 వరకు పెంచే విధంగా మళ్లీ అడ్మిషన్ డ్రైవ్ చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు.
ప్రభుత్వ కళాశాలలో NEET, JEE, EAPCET, CLAT, CA కు సంబంధించి ఫిజిక్స్ వాలా అనేక ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు ఉచితంగా కల్పిస్తున్నమని ఇలాంటి అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నప్పటికీ పదో తరగతి పాసైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకునే విధంగా వారి యొక్క గ్రామాలలో అధ్యాపకులు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో వివరించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సింగం శ్రీనివాస్, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.