calender_icon.png 19 September, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసునూరు ఆదర్శ పాఠశాల లో ఫ్రెషర్స్ డే

19-09-2025 05:17:50 PM

నాగారం: నాగారం మండల పరిధిలోని పసునూరు  ఆదర్శ పాఠశాల లో శుక్రవారం  ప్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు.  ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. ముఖ్యఅతిథులుగా ఎంఈఓ  ప్రభాకర్, ఎస్సై అవిలయ్య హాజరై విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. బాగా చదివి తల్లిదండ్రులకు, కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.గత సంవత్సరం స్టేట్ ర్యాంకు అభినందనీయం. ఈ సంవత్సరం మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు . ఫ్రెషర్స్ డే లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని  ఆకట్టుకున్నాయి.