బీసీ సంక్షేమ వసతి గృహాల బాట కార్యక్రమం ప్రారంభం
27-08-2026 12:00 AM
ముకరంపుర, ఆగస్టు 26 (విజయ క్రాంతి): బీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ వసతి గృహాల బాట కార్యక్రమాన్ని బుధవారం నగరంలోని పలు బిసి వసతి గృహాలలో ప్రా రంభించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీ ధర్ రాజు మాట్లాడుతూ నగరంలో 9 బిసి సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే వీటికి స్థలాన్ని కేటాయించాలని, నిర్మాణానికి నిధు లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అ లాగే ఖాళీగా ఉన్న సంరక్షణ అధికారుల పో స్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ మి యాపురం రవీంద్ర చారి, రాజు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.






